రైస్ మిల్లులో తనిఖీలు.. ధాన్యం మాయం!

రైస్ మిల్లులో తనిఖీలు.. ధాన్యం మాయం!

WNP: ఖిల్లా గణపురం మండలం సోలిపూర్ గ్రామంలోని SLNS రైస్ మిల్లులో జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్ ఆకస్మిక తనిఖీలు చేశారు. మిల్లులో కేవలం 13.32 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన 3,415 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు లేక, సుమారు రూ.8 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారులు నిర్ధారించారు.