పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: కమిషనర్

SRD: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరి కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ రవీందర్ అన్నారు. వందరోజుల ప్రణాళికలో భాగంగా జోగిపేటలోని కేజీబీవీ పాఠశాలలో మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటిన మొక్కలను సంరక్షించేలా ఉపాధ్యాయులు విద్యార్థులు చొరవ తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి పాల్గొన్నారు.