బాధితులకు సరుకులు అందజేసిన ఇంఛార్జ్

కామారెడ్డి జిల్లా కేంద్రంలో వారం రోజుల క్రితం వరద ముంపుకు గురైన జి ఆర్ కాలనీ వాసులకు అంబేద్కర్ సేవా సమితి జిల్లా ఇంఛార్జి భూంపల్లి భీంరావు ఆధ్వర్యంలో బుధవారం బాధితులకు నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జి ఆర్ కాలనీ బాధితులు, అంబేద్కర్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.