VIDEO: ఇందిరమ్మ చీరల పేరుతో మహిళలను మోసం: ఎర్రబెల్లి
JN: స్టేషన్ ఘన్పూర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ చీరల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేస్తోందని, చీరలు తీసుకుంటే మహిళల పేరుపై రూ. 1,200 అప్పు చేసినట్లేనని, భవిష్యత్తులో చీరల డబ్బులు కట్టాలని నోటీసులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.