డీఎస్సీలో ప్రతిభ కనబరిచిన పాలింగి అనూష

డీఎస్సీలో ప్రతిభ కనబరిచిన పాలింగి అనూష

కోనసీమ: కపిలేశ్వరపురం మండలం వడ్లమూరు గ్రామానికి చెందిన పాలింగి అనూష విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో 86.39 మార్కులు సాధించి, జిల్లాలో 69వ ర్యాంకు, ఎస్సీ కేటగిరీలో 5వ ర్యాంకు సాధించింది. నిరుపేద కుటుంబంలో జన్మించిన అనూష.. గ్రామానికి చెందిన పాలింగి శ్రీనివాస్–బేబీ దంపతుల రెండవ సంతానం. అనూష సాధించిన ఈ విజయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.