మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం
మహారాష్ట్ర పూణె మున్సిపాలిటీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భోపాలా చౌక్‌లో బట్టలను నిల్వ చేసిన ఓ మూడు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నికీలలు భారీ ఎత్తున ఎగిసి పడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.