GVMC ప్రజా సమస్యల వేదికకు 119 వినతులు
VSP: GVMC “ప్రజా సమస్యల పరిష్కార వేదిక”లో మొత్తం 119 వినతులు స్వీకరించినట్లు మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. ఈ వేదికకు జోన్లవారీగా, విభాగాల వారీగా ఫిర్యాదులు అందాయి. కమిషనర్ కేతన్ గార్గ్ విభాగాధిపతులకు అర్జీలు అదే రోజు పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో GVMC అధికారులు పాల్గొన్నారు.