ఇఫ్తార్ విందులో పాల్గొన్న MLA గండ్ర
BHPL: మున్సిపాలిటీ పరిధిలోని మంజూర్ నగర్ 1,000 క్వార్టర్స్ జామా మసీదులో శనివారం రాత్రి ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ విందులో MLA గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాట్లాడుతూ.. రంజాన్ మాసంలో పాటించే ఉపవాస దీక్ష ద్వారా మనిషిలో నియంత్రణ, పరస్పర గౌరవం, సోదరభావం పెరుగుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో DCC అధ్యక్షుడు కరుణాకర్ తదితరులు ఉన్నారు.