అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ
GDWL: జిల్లాలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం అంగన్‌వాడీ టీచర్లకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. అంగన్‌వాడీల పనితీరును మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించిన ప్రతి వివరాలను ఇకపై ప్రభుత్వ అధికారిక యాప్‌లో ఉండాలన్నారు.