అర్హులందరికీ న్యాయం చేస్తాం: ఎమ్మెల్యే సింధూర
సత్యసాయి: నల్లమాడ మండలం సుబ్బరాయునిపల్లిలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పర్యటించారు. గ్రామంలో వాటర్ ట్యాంక్ నిర్మాణం, ఇంటి పట్టాలు, నూతన గృహాల మంజూరుపై గ్రామస్థులు విన్నవించగా, అర్హులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పులగంపల్లిలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి పరిశీలించారు.