వర్షం దాటికి కూలిపోయిన ఇల్లు
KRNL: పెద్దకడబూరులోని ఎస్సీ కాలనీలో సోమవారం జగతప్ప యేసన్నకు చెందిన ఇళ్లు ఇటీవల కురిసిన వర్షానికి కూలిపోయింది. నిత్యావసర సరుకులు, కుటుంబానికి కావాల్సిన సామాగ్రి పూర్తీగా ధ్వంసం అయినట్లు బాధితుడు తెలిపారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లు అయింది. అధికారులు స్పందించి సహాయం చేయాలని బాధిత కుటుంబం కోరారు.