జిల్లాలో 12న ముఠాకార్మికుల సమ్మె
VSP: 4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలంటూ ఫిబ్రవరి 12న ముఠా కార్మికులు సమ్మెకు దిగనున్నట్లు సీఐటీయూ నాయకులు తెలిపారు. మద్దిలపాలెంలో జరిగిన జనరల్ బాడీలో మాట్లాడిన నాయకులు, కొత్త లేబర్ కోడ్‌ల వల్ల కూలి రేట్లు తగ్గి ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.