VIDEO: అధికారుల నిర్లక్ష్యంపై MLA ప్రవీణ్ ఫైర్
PLD: '100 రోజులు-100 గ్రామాలు' పర్యటనలో భాగంగా పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అమరావతి మండలం ఎండ్రాయిలో గురువారం ప్రజల సమస్యలు విన్నారు. ప్రజల సమస్యల అర్జీలు అధికంగా కావడానికి సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆయన అధికారుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను గట్టిగా హెచ్చరించారు.