అలరించిన దశావతారాల నృత్య ప్రదర్శన

అలరించిన దశావతారాల నృత్య ప్రదర్శన

MDCL: అల్వాల్‌కు చెందిన స్వరాంజలి డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని శిల్పారామంలో భరతనాట్య నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. అకాడమీ అధ్యక్షురాలు వర్ష తన విద్యార్థులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారులు ప్రదర్శించిన దశావతారాల నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. శిల్పారామం వంటి వేదికపై తమ పిల్లలు నాట్యం చేయడం ఆనందంగా ఉందని తల్లిదండ్రులు తెలిపారు.