VIDEO: కరీంనగర్‌లో అగ్నిప్రమాదం

KNR: అశోక్ నగర్లో ఓ మూడంతస్తుల భవనంలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. భవనంలోని మొదటి, రెండవ అంతస్తులకు మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.