ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
JGL: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, జగిత్యాల డీఈవో రాము అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని కోజన్ కొత్తూరు గ్రామంలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలను డీఈవో రాము సందర్శించారు. ఇటీవల విడుదలైన నవోదయ విద్యాలయ ఫలితాల్లో జిల్లా స్థాయిలో 5వ ర్యాంకు సాధించిన పాఠశాలకు చెందిన ముత్యాల మిధునకు డీఈవో జ్ఞాపిక అందజేసి, ప్రశంసా పత్రంతో అభినందించారు.