మద్యం తాగి వాహనాలు నడిపిన ఆరుగురికి జరిమానా

మద్యం తాగి వాహనాలు నడిపిన ఆరుగురికి జరిమానా

SDPT: ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం తాగి వాహనాలు నడిపిన ఆరుగురికి రూ.60,500 జరిమానా విధించినట్టు సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేటలో నర్సాపూర్, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తా, రాజీవ్ రహదారిపై వాహనాల తనిఖీ చేయగా, ఆరుగురు మద్యం తాగి వాహనాలు నడపడంతో వారికి కోర్టు జరిమానా విధించిందన్నారు.