మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళులు

VZM: గజపతినగరంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్ర పటానికి గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు అని పేర్కొన్నారు. దేశాభివృద్ధికి గొప్ప సంస్కరణలు చేపట్టారని కొనియాడారు.