కబడ్డీ రాణించిన శ్రీకర్‌ను అభినందించిన ఎమ్మెల్సీ
SRPT: తుంగతుర్తిలోని జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జక్కి శ్రీకర్ అండర్-14 విభాగంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అభినందించారు. విద్యార్థి శ్రీకర్‌ను పూలమాలతో సన్మానించి ప్రశంసపత్రం అందించారు. కార్యక్రమంలో ఎంపీవో, పీడీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.