VIDEO: ఘనంగా పోచమ్మ తల్లి బోనాల వేడుకలు

VIDEO: ఘనంగా పోచమ్మ తల్లి బోనాల వేడుకలు

JGL: జగిత్యాల మండలం వెల్దుర్తి గ్రామంలో పోచమ్మ బోనాల కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ మహిళలు సంప్రదాయబద్ధంగా అధిక సంఖ్యలో బోనాలు ఎత్తుకొని పోచమ్మకు సమర్పించారు. డప్పుల చప్పుళ్లు, ఊరేగింపులతో గ్రామంలో ఉత్సవ వాతావరణం నెలకొంది. పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.