విద్యుత్ సరఫరాకు అంతరాయం

విద్యుత్ సరఫరాకు అంతరాయం

WG: మత్స్యపురి సబ్ స్టేషన్‌లో మంగళవారం కొత్త విద్యుత్ లైన్ ఏర్పాటు పనులు చేపట్టనున్నట్లు నరసాపురం ఈఈ కె. మధు కుమార్ తెలిపారు. ఈ పనులు కారణంగా మంగళవారం మత్స్యపురి, చిన్నపేట, జొన్నలగరువు, కంసాల బేతపూడి, తుమ్మలపల్లి గ్రామాల్లో ఉదయం 9 గంటలు నుంచి మధ్యాహ్నం 2 గంటలు వరకూ విద్యుత్ సరఫరా ఉండదన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఈఈ కోరారు.