VIDEO: 'ఒగ్గు పూజారుల దోపిడీ చేస్తున్నారు'

VIDEO: 'ఒగ్గు పూజారుల దోపిడీ చేస్తున్నారు'

HNK: ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆదివారం ఒగ్గు పూజారులు భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారని భక్తులు ఆరోపించారు. రూ.300 చెల్లించి టికెట్ తీసుకున్న అనంతరం ఒగ్గుపూజారి రాజేష్ మరో రూ.700 డిమాండ్ చేశాడని భక్తుడు రామ్ కుమార్ తెలిపారు. అదనపు డబ్బు ఇవ్వకపోవడంపై ప్రశ్నించగా, పూజను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడని ఆయన ఆరోపించారు.