రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని పరమర్శించిన మాజీమంత్రి
MBNR: ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న నగర కార్పొరేషన్ పరిధిలోని 26వ డివిజన్ పాత పాలమూరుకు చెందిన పెంటయ్యను మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ గురువారం ఆయన నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్సను తీసుకోవాల్సిందిగా ఆయనకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.