"ఆర్టీసీ కార్మికులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి"
NLG: దేవరకొండ ఆర్టీసీ డిపోలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ తార్నాక హాస్పిటల్ డాక్టర్ రసజ్ఞ మంగళవారం సందర్శించారు. ఇందులో భాగంగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు, సలహాలు, సూచనలు చేశారు. మద్యపానం, ధూమపానం లాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. వ్యాయామం, నడక ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు.