పెద్దమ్మతల్లికి పంచామృతాలతో అభిషేకం
BDK: పాల్వంచ మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయంలో శుక్రవారం ఆలయ కార్యనిర్వాహణ అధికారి రజిని కుమారి ఆదేశాల మేరకు అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమం నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి అంతరాలయంలో పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ బాలినేని నాగేశ్వరరావు భక్తులు పాల్గొన్నారు.