ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరించిన కలెక్టర్
MHBD: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొని వివిధ గ్రామాల నుంచి వచ్చిన దరఖాస్తుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు.