స్కేటింగ్ చేస్తూ క్లాసికల్ డాన్స్.. అదరహో!

స్కేటింగ్ చేస్తూ క్లాసికల్ డాన్స్.. అదరహో!

స్కేటింగ్ చేస్తూ క్లాసికల్ డాన్స్ చేయడం ఎప్పుడైనా చూశారా? మంగళూరుకు చెందిన సుశ్రావ్య అదే చేసి చూపించింది. కాళ్లకు చక్రాలు కట్టుకుని.. ఏకధాటిగా 4 గంటల పాటు సాంప్రదాయ నృత్యం చేసి ఔరా అనిపించింది. అడుగు తడబడకుండా చేసిన ఈ ఫీట్‌తో 'గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో స్థానం కొట్టేసింది. త్వరలో 12 గంటల పాటు ప్రదర్శన ఇస్తానని ఈ బీఎస్సీ విద్యార్థిని ఛాలెంజ్ చేస్తోంది.