నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VSP: కసింకోట మండలం నర్సింగబిల్లి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతులు చేపడుతున్న కారణంగా బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రామకృష్ణ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నర్సింగబిల్లి, త్రిపురవానిపాలెం, గొబ్బూరు, తాళ్లపాలెం, బంగారయ్య పేట, పరవాడపాలెం, కొత్తపల్లి తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.