VIDEO: అక్రమ నిర్మాణలను తొలగించాలని ధర్నా రాస్తారోకో

HNK: ఐనవోలు మండలం పంతిని గ్రామంలో అక్రమ నిర్మాణాలను తొలగించాలని కోరుతూ గ్రామస్థులు ఆదివారం వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. వ్యవసాయ పొలాలకు వెళ్లే దారిని స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకుని అక్రమ నిర్మాణాలు తొలగించాలని డిమాండ్ చేశారు.