నిర్మాత పురుషోత్తంతో తులసి రెడ్డి భేటీ

నిర్మాత పురుషోత్తంతో తులసి రెడ్డి భేటీ

KDP: ప్రముఖ సినీ హాస్యనటుడు పద్మనాభం తమ్ముడు, నిర్మాత పురుషోత్తంను మాజీ ఎంపీ తులసిరెడ్డి ఆదివారం సింహాద్రిపురంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పద్మనాభం సినీ సేవలను గుర్తు చేసుకున్నారు. నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించిన పురుషోత్తంను తులసిరెడ్డి అభినందించి, వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం ఇరువురు సినీ రంగంపై చర్చించారు.