ఆగిరిపల్లిలో సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి హామీ
ELR: ఆగిరిపల్లి మండలం కొత్త సురవరం గ్రామంలో ఇవాళ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా BC కాలనీలో 150 మీటర్లు మరియు హరిజనవాడలో 150 మీటర్లు సీ.సీ రహదారిని నిర్మించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.