గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరి మృతి
SKLM: జి.సిగడాం మండలం వాడ్రంగి గ్రామ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షంలో రోడ్డుపై నడుస్తున్న ఇద్దరు యాచకులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో యాచకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.