దాడి కేసులో ఓ వ్యక్తికి ఐదేళ్ల జైలు, 10,000 జరిమానా

BHNG: మోత్కూర్ మండలం పొడిచేటి గ్రామంలో 2020లో జరిగిన దాడి కేసులో నిందితుడు కాసర్ల జానయ్యకు రామన్నపేట కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించింది. పొలాల వివాదంలో గొడ్డలితో కాసర్ల అంజయ్యపై దాడి చేసిన కేసులో దర్యాప్తు పూర్తి చేసి పోలీసులు కోర్టుకు హాజరుపరచారు. బుధవారం తీర్పు వెలువడిందని మోత్కూర్ హెచ్‌ఎస్‌వోసీ వెంకటేశ్వర్లు తెలిపారు.