ఈనెల 21 నుంచి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు
AKP: పాయకరావుపేట మండలం కుమారపురంలో కొత్తగా నిర్మించిన కుమార ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ఈనెల 21 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇవాళ గోడపత్రికను ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి చేతుల మీదుగా ఆలయం ప్రారంభం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుందన్నారు.