'విద్యార్ధుల సృజనాత్మకత అభినందనీయం'

'విద్యార్ధుల సృజనాత్మకత అభినందనీయం'

KKD: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సృజనాత్మకతకు మంచి ప్రోత్సాహం ఉంటుందని, అది భవిష్యత్‌కు ఎంతో మేలు చేస్తుందని సామర్లకోట ఎంఈవో పి.పుల్లయ్య పేర్కొన్నారు. శనివారం పి.ఎం. శ్రీ బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు తోటకూర సాయి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన స్పోర్ట్స్ అండ్ కల్చరల్ వారోత్సవాలు ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.