'నిరుద్యోగ ఆవేదన సదస్సును విజయవంతం చేయండి'

SKLM: కూటమి ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్న నేపథ్యంలో నిరుద్యోగ ఆవేదన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు యుగంధర్, ప్రధాన కార్యదర్శి కే శ్రీనివాసరావు తెలిపారు. గురువారం శ్రీకాకుళం క్రాంతి భవన్ లో సమావేశం నిర్వహిస్తూ ఈ నెల 17వ తేదీన విజయవాడలో ఈ సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.