మంత్రి సుభాష్ నేటి పర్యటన వివరాలు

కోనసీమ: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఇవాళ్టి పర్యటన వివరాలను మంత్రి కార్యాలయ సిబ్బంది ఆదివారం రాత్రి వెల్లడించారు. సోమవారం ఉదయం 10గంటలకు అమరావతిలో జరిగే కలెక్టర్ల సదస్సులో పాల్గొంటారని తెలిపారు. రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి అందుబాటులో ఉండరని ప్రజలు గమనించాలని కార్యాలయం సిబ్బంది పేర్కొన్నారు.