గ్రామస్తులకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం

గ్రామస్తులకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం

SRPT: నడిగూడెం మండలంలోని రత్నవరం గ్రామస్తులకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యమని సర్పంచ్ నాగేష్ తెలిపారు. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి ఇవ్వాళ ఊరిలోని బావులు, బోర్లు, చేతి పంపుల్లో బ్లీచింగ్ పౌడర్ వేయించారు. కలుషిత నీటి వల్ల వ్యాధులు ప్రబలకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కాచి వడపోసిన నీటిని తాగాలన్నారు.