కొలిమిగుండ్ల పట్టణంలో పోలీసు కవాతు....

కొలిమిగుండ్ల పట్టణంలో పోలీసు కవాతు....

కొలిమిగుండ్ల పట్టణంలో మంగళవారం సీఐ గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఎవరు ఘర్షణలకు పాల్పడవద్దని సూచించారు. ఎవరైనా నిబంధనలో ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా ఓట్ల లెక్కింపు రోజున కూడా రాజకీయ పార్టీ నాయకులు సంయమనం పాటించాలని సూచించారు.