దంతేపల్లిలో ఘనంగా సిసి రోడ్డు పనుల ప్రారంభం
MDK: రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామంలో సిసి రోడ్డు పనులను ఘనంగా ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ మస్కూరి బాలరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాధా మల్లేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ గౌడ్ హాజరై, పంచాయతీ సెక్రెటరీ రమాదేవి ఆధ్వర్యంలో పనులకు పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు.