ఎడ్ల బండిని ఢీకొని ద్విచక్ర వాహనదారుడి మృతి

KDP: బ్రహ్మంగారిమఠం మండలం నరసన్నపల్లెకు చెందిన దేవరకొండ నరసయ్య యాదవ్ (42) స్కూటర్‌పై వెళ్తూ ఎడ్ల బండిని ఢీకొట్టాడు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. అదే గ్రామానికి చెందిన సోమిరెడ్డి పల్లె నరసయ్య ఎడ్ల బండిపై పొలం వెళ్తుండగా నరసయ్య యాదవ్ స్కూటర్‌పై వేగంగా వెళ్తూ బండిని ఢీ కొట్టాడు. చికిత్స నిమిత్తం పొద్దుటూరుకి తరలిస్తుండగా మృతిచెందాడు.