జిల్లాలో ముమ్మరంగా 'విజిబుల్ పోలీసింగ్'

జిల్లాలో ముమ్మరంగా 'విజిబుల్ పోలీసింగ్'

ATP: జిల్లా SP జగదీష్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా శనివారం సాయంత్రం పోలీసులు 'విజిబుల్ పోలీసింగ్' నిర్వహించారు. పట్టణాలు, మండల కేంద్రాల్లో వాహన తనిఖీలు ముమ్మరం చేసి, ఫుట్ పెట్రోలింగ్ చేపట్టారు. రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించారు. అక్రమ రవాణాను నియంత్రించడం, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణపై దృష్టి సారించినట్లు పోలీసులు తెలిపారు.