పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
SDPT: జగదేవ్‌పూర్ మండలం గొల్లపల్లి శివారులో శ్రీ రామాంజనేయ పత్తి మిల్లు కొనుగోలు కేంద్రాన్ని గజ్వెల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సముద్రాల హరినాథ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జూలకంటి ప్రభాకర్, బుద్ధ బాల్ నారాయణ, వెంకటేశ్వర్లు జూలకంటి ,శ్రీనివాస్, భూరుగుపల్లి కర్ణాకర్, యాదయ్య, శ్రీనివాస్ గౌడ్, వెల్డండ నర్సింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.