'జగన్ 2.O'లో కార్యకర్తలకు పెద్దపీట: జగన్

'జగన్ 2.O'లో కార్యకర్తలకు పెద్దపీట: జగన్

AP: 'జగన్ 2.O' ప్రణాళికలో భాగంగా పార్టీ కార్యకర్తలకు అత్యున్నత ప్రాధాన్యత కల్పిస్తామని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో సీట్ల సంఖ్య పెరుగుతుందని, దీనివల్ల కష్టపడే కార్యకర్తలు నాయకులుగా ఎదిగే అవకాశం ఉంటుందని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల రాకను స్వాగతిస్తూ, గత వైసీపీ హయాంలోనే మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.