రేపు రైల్వే గేట్ మూసివేత

రేపు రైల్వే గేట్ మూసివేత

SKLM: ఆమదాలవలస మండలం దూసి రైల్వే గేట్‌ను గురువారం, శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మూసివేయనున్నారు. రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాహనదారులు, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.