కొలిమిగుండ్ల రైతులకు రూ.3.51 కోట్లు సాయం: AO
NDL: కొలిమిగుండ్ల మండలంలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల కింద 11,360 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. మొత్తం రూ.3.51 కోట్ల నిధులు శుక్రవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతాయని మండల వ్యవసాయ అధికారి శారదాదేవి తెలిపారు. పీఎం కిసాన్ నుంచి రూ.2,000, అన్నదాత సుఖీభవ నుంచి రూ.4,000 కలిపి ఒక్కో రైతుకు రూ.6,000 నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నట్లు పేర్కొన్నారు.