కుట్టు శిక్షణ స్కీమ్‌లో ఎలాంటి స్కామ్ జరగలేదు: మంత్రి

కుట్టు శిక్షణ స్కీమ్‌లో ఎలాంటి స్కామ్ జరగలేదు: మంత్రి

సత్యసాయి: సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నాడని మంత్రి సవిత అన్నారు. బుధవారం అమరావతిలో మంత్రి మాట్లాడుతూ.. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రారంభించిన కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమంపై స్కామ్ జరిగిందని జగన్ తప్పుడు రాతలు రాయిస్తున్నారని మండిపడ్డారు. కుట్టు శిక్షణలో ఎలాంటి స్కామ్ జరగలేదని తెలిపారు.