గ్రామాల అభివృద్దే లక్ష్యం: ఎమ్మెల్యే గిడ్డి

గ్రామాల అభివృద్దే లక్ష్యం: ఎమ్మెల్యే గిడ్డి

కోనసీమ: మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాల బాలాజీ స్వామి ఆలయం వద్ద ఎంపీ ల్యాడ్స్ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శనివారం భూమిపూజ చేసి, శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్దే తన లక్ష్యమని, ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని అన్నారు.