VIDEO: పెద్ద కాపర్తి స్మశాన వాటికలో సౌకర్యాల కల్పన
NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి స్మశానవాటికలో అన్ని సౌకర్యాలను కల్పించినట్లు ఆ గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం తెలిపారు. స్నానపు గదులు, కర్మకాండల కోసం దిమ్మలు, విద్యుత్, వాటర్ సౌకర్యం కల్పించడంతోపాటు పరిసరాలను చదును చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమం జరిగే రోజున నీటి సౌకర్యం, గదుల తాళాల కోసం గ్రామ పంచాయతీ వాటర్ మెన్‌ను సంప్రదించాలని సూచించారు.