VIDEO: మధురానగర్‌లో కత్తిపోట్ల కలకలం
HYD: మధురానగర్ PS పరిధిలో ఓ వక్తి కత్తితో హల్‌చల్ చేశాడు. పిల్లర్ నంబర్ 1482 వద్ద ఉన్న వారాహి కన్సల్టెన్సీలో జాబ్ విషయంలో జరిగిన వివాదంతో గుర్తు తెలియని వ్యక్తి మేనేజర్ శశికిరణ్ రెడ్డి(38), ట్రైనర్ లయ(25)పై కత్తితో దాడి చేశాడు. ఇద్దరినీ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శశికిరణ్ మరణించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.